Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-01-2021 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (05:00 IST)
మేషం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. శ్రమాధిక్యత, మానసిక ఒత్తిడి వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. కార్యసాధనలో ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. 
 
వృషభం : మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మలను మోసగించే ఆస్కారం ఉంది. ఆత్మీయుల తోడ్పాటు, మీ శ్రమకు తగిన గుర్తింపు రాణింపు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కలప, సిమెంట్, ఇటుక, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటారు. 
 
మిథునం : పత్రికా రంగంలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్ధానాలు చేయకండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీ ఆగ్రహావేశాలు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కర్కాటకం : హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
సింహం : ఉద్యోగస్థులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావొచ్చు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. తెలియని ఉత్సాహం ధైర్యం మీలో చోటుచేసుకుంటుంది. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును. 
 
కన్య : ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాకయం. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. బ్యాంకు పనుల్లో మందకొడిగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 
 
తుల : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాపడతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. 
 
వృశ్చికం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాంచేటపుడు మెళకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. 
 
ధనస్సు : స్త్రీలు, టీవీ ఛానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలుసాగించండి. 
 
మకరం : విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల ఆప్రమత్తంగా వ్యవహరించవలసి వుంటుంది. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. 
 
కుంభం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఫ్లీడర్లు, ఫ్లీడర్ గుమస్తాలకు సత్‌కాలం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. 
 
మీనం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గట్టిగా ప్రయత్నిస్తేగానీ మొండి బాకీలు వసూలు కావు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. మీకు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధమవుతాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

Janmastami 2025: కదంబ వృక్షంతో శ్రీకృష్ణునికి వున్న సంబంధం ఏంటి?

తర్వాతి కథనం
Show comments