Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-01-2021 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ మహాలక్ష్మీని పూజిస్తే..?

Advertiesment
01-01-2021 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. శ్రీ మహాలక్ష్మీని పూజిస్తే..?
, శుక్రవారం, 1 జనవరి 2021 (04:00 IST)
శ్రీ మహాలక్ష్మీని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి శుభదాయకం. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో ఎదుర్కొంటారు. స్త్రీలు ఒత్తిడికి లోనైన మంచి గుర్తింపు లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.
 
వృషభం: ఆత్మీయులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రిప్రజెంటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. వ్యవసాయ తోటల రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యులు మిమ్మల్ని మధ్యవర్తిత్వం వహించమని కోరతారు. మెళకువ అవసరం. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. 
 
మిథునం: ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రులతో, స్త్రీలతో అలంకరణ, విలాస వస్తువల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు శ్రమించి సకాలంలో పూర్తి చేస్తారు. రచయితలకు పత్రికా రంగంలో వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 
 
కర్కాటకం: ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా సంతృప్తి వుండజాలదు. నూతన వస్త్రములను బహూకరిస్తారు. విదేశాల్లో ఉన్నవారికి శుభాకాంక్షలు అందజేస్తారు. పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్, కార్మిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యంతో వ్యవహరించవలసి ఉంటుంది. 
 
సింహం: ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి ఆస్కారం వుంది. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మికభేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. 
 
కన్య: కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విందులు, వినోదాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను, అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి.
 
తుల: ప్రముఖులను, బంధుమిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో సఫలీకృతులవుతారు. బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఊహించని ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. 
 
వృశ్చికం: బంధు మిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది.
 
ధనస్సు: ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబెల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులను విందుకు ఆహ్వానిస్తారు. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. 
 
మకరం: హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకు అధికం కాగలవు. అనవసరపు సంభాషణ వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. సంఘంలో మీకు పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.
 
కుంభం: పంతాలకు పోకుండా బంధువులతో ఆదరంగా మెలగండి. తలపెట్టిన పనుల్లో కొంతముందు వెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం: కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళన తప్పదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బృహస్పతిని గురువారం పూజిస్తే..?