Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-01-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా...

Advertiesment
04-01-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా...
, సోమవారం, 4 జనవరి 2021 (05:00 IST)
మేషం : ఆర్థిక కార్యకలాపాలు చాలా సమర్థవంతంగా నడుపుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ఉన్నట్టుండి వేదాంత ధోరణి కానవస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వస్తుంది. 
 
వృషభం : సిమెంట్, ఐరన్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి సంతృప్తినిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
మిథునం : పందాలు, జూదాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభించినా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించండి. 
 
కర్కాటకం : ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ పనులు మందకొడిగా సాగడం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక సంబంధం, బాంధవ్యాలు మెరుగవగలవు. బంధు మిత్రుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది. 
 
సింహం : పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి వస్తుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కన్య : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు లాభదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయ. నూతనంగా చేపట్టిన వ్యాపారాలలో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. 
 
తుల : ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ మనోభావాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. ఖర్చులు పెరగడంతో కుటుంబంలో రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు సన్నిహితుల సాయం కోరతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విలువైన ఆస్థులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
ధనస్సు : ఉమ్మడి ఆర్థిక లావాదేవీలతో మాట పడాల్సి రావొచ్చు. మీ ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత లభిస్తుంది. గతానుభవంతో లక్ష్యం సాధిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. నిర్మాణ పథకాలలో పురోభివృద్ధి కానవస్తుంద. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. 
 
మకరం : మీ అంచనాలు నిజమైన ఊరట చెందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పరోపకారానికి పోయి సమస్యలను తెచ్చుకుంటారు. బ్యాంకు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
కుంభం : మీ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ప్రతి విషయంలోనూ మౌనం వహించడం మంచిది అని గమనించండి. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడుల కోసం పనులు ముమ్మరం చేస్తారు. 
 
మీనం : స్త్రీలకు వస్తు, వస్త్ర, ఆభరణాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రవాణా రంగంలోని వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణాల తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ పార్టీల నాయకులకు ఒకస్థాయి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-01-2021 ఆదివారం మీ రాశి ఫలితాలు.. మీ ఇష్టదైవాన్ని..?