Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-01-2021 ఆదివారం మీ రాశి ఫలితాలు.. మీ ఇష్టదైవాన్ని..?

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 3 జనవరి 2021 (07:08 IST)
మీ ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా చూసుకోవాలి. చీటికిమాటికి ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. సభ్యత్వాలు, పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. 
 
వృషభం: పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో వుంచుకోండి. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా వుంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. 
 
మిథునం: గృహంలో ఏదైనా వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అవసరాలకు ధనం సర్దుబాటు కాగలదు. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ద్వితీయ భాగం నుంచి సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు.
 
కర్కాటకం: శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త ప్రయత్నాలు మొదలెడతారు. దైవ, సేవా పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి కొద్దిపాటి లాభాలు గడిస్తారు. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. 
 
సింహం : కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అసంపూర్తిగా వదిలేసిన పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. సేల్స్ సిబ్బందికి ధన, వస్తు ప్రతిఫలం అందిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కన్య: ఆశాదృక్పథంతో కొత్త యత్నాలు సాగిస్తారు. రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు. పండ్ల, పూల, కొబ్బరి చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. పెద్దలు ఆత్మీయుల గురించి అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. 
 
తుల : మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు స్వల్ప ఆటుపోట్లు తప్పవు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా అవసరం. కమ్యూనికేషన్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. 
 
వృశ్చికం: స్కీమ్‌లు, వాయిదాల పద్ధతితో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. తరుచూ సభలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. రాజకీయ నాయకులకు ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తు వేసి ముందుకు సాగండి. 
 
ధనస్సు: ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
మకరం: సంతానం చదువుల నిమిత్తం భవిష్యత్ ప్రణాళికలు రూపొందస్తారు. అవగాహన లేని విషయాలకు దూరంగా వుండాలి. పెద్ద మొత్తంలో ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. సోదరీ సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాల ప్రస్తావన వస్తుంది. మీ శ్రీమతి సలహా ప్రకారం నడుచుకోవడం మంచిది. 
 
కుంభం: వ్యవహార దక్షతతో సమస్యను పరిష్కరిస్తారు. స్వార్థ పూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారికి దూరంగా ఉంచండి. మీ మనోసిద్ధికి ఇది సరైన సమయం అని గమనించగలరు. అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. మిమ్ములను ఉద్రేకపరిచి ఆనందించాలని కొంతమంది ప్రయత్నిస్తారు.
 
మీనం: స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. హామీలు, సంతకాలు చెల్లింపుల్లో తొందరపడవద్దు. దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థుల ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3-1-2021 నుంచి 9-1-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు