Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయలు-నిమ్మకాయలతో వెరైటీ రైస్

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (00:02 IST)
రుచిగా పదార్థాలను చేసుకోవడం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వుండాలంటారు పెద్దలు. ఇపుడు మనం ఓ వెరైటీ వంటకాన్ని చూద్దాం. వంకాయలు, నిమ్మకాయలతో రైస్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు- రెండు
లవంగాలు- నాలుగు
ఏలక్కాయలు- నాలుగు 
గసగసాలు- అర టీస్పూన్ 
సోంపు- అర టీస్పూన్ 
లవంగం పట్ట- ఒకటి
నిమ్మకాయలు- మూడు
ఉడికించిన అన్నం- తగినంత
నూనె- సరిపడా
ఉప్పు- తగినంత
సన్నగా తరిగిన కొత్తిమీర- అర కప్పు
 
తయారీ విధానం :
లేత వంకాయలను సన్నగా తరిగి రెండు టీ స్పూన్ల నూనెతో వేయించి అందులో లవంగాలు, యాలక్కాయలు, గసగసాలు, సోంపు, లవంగం పట్టలతో నూరిన మసాలా ముద్దను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసాన్ని కూడా పట్టించి కాసేపు సన్నటి మంటపై ఉడికించాలి.
 
చివరగా పై మిశ్రమంలో ఉడికించిన అన్నాన్ని కలుపుకొని... కాసేపు వేయించి పైన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే.. వంకాయ-నిమ్మతో రైస్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

పనితీరులో అగ్రస్థానం.. కానీ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు పదో స్థానం.. ఎందుకని?

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

Chennai Auto: ఆటోలో యువతి కిడ్నాప్-పోలీసులు వెంబడించాక రోడ్డుపై తోసేశారు.. ఇద్దరు అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

తర్వాతి కథనం
Show comments