Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాలయ అమావాస్య: వంకాయలను వండటం తినడం కూడదట..

మహాలయ అమావాస్య: వంకాయలను వండటం తినడం కూడదట..
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:30 IST)
మహాలయ అమావాస్య రోజున బియ్యం, మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయ, హోటల్ తిండి మానుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంట్లో తయారుచేసిన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వంకాయను వండటం తినడం మానుకోవాలి. వంటల్లో మైసూర్ పప్పు, నలుపు మినప్పప్పు, నలుపు జీలకర్ర, బ్లాక్ సాల్ట్, ఆవాలు వాడకూడదు. 
 
అలాగే శ్రాద్ధమిచ్చే వ్యక్తి గోళ్లను కత్తిరించకూడదు. షేవింగ్, హెయిర్ కట్ చేయకూడదు. మాసిన దుస్తులు ధరించకూడదు. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు బెల్టు, స్లిప్పర్స్ వాడకూడదు. ముఖ్యంగా చర్మంతో చేసిన చెప్పులు, బెల్టులు ధరించకూడదు. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు మాట్లాడటం చేయకూడదు. పొగాకు నమలడం, సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం.. వంటివి మహాలయ అమావాస్య రోజున పక్కనబెట్టేయాలి. 
webdunia
Brinjal
 
బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజున ఇతరులను దూషించడం వంటివి చేయకూడదు. పరుష పదాలను వాడకూడదు. అసత్యాలు పలకకూడదు. శ్రాద్ధ కర్మలకు ఎరుపు రంగు పువ్వులను వాడకూడదు. వాసన లేని పువ్వులను అస్సలు వాడకూడదు. మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ముగించుకుని భోజనం చేయాలి. 
 
శ్రాద్ధ కర్మల కోసం ఇనుప పాత్రలను ఉపయోగించవద్దు. పితృదేవతల శ్రాద్ధ కర్మలకు వెండి, రాగి లేదా కాంస్య పాత్రలను వాడండి. ఇనుముపై కూర్చోకండి. కలప పీటలపై కూర్చోవడం చేయండి. మహాలయ అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం చేయకూడదు. ముందు రోజే కొనిపెట్టుకోవడం మంచిది. కొత్త కొత్త వ్యాపారాలు చేపట్టడం, గృహ ప్రవేశం చేయడం వంటివి మహాలయ అమావాస్య రోజున నిషిద్ధం.
 
కొత్త వాహనాలను కూడా ఈరోజున కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. శ్రద్ధ కర్మ సాయంత్రం, రాత్రి, తెల్లవారుజాము లేదా సంధ్యా సమయంలో చేయకూడదు. సూర్యోదయానికి తర్వాత మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య.. పితరులు వారసుల ఇళ్ల పరిసరాల చుట్టూ తిరుగుతారట..!