బుధవారం, గణేశుడి ఆరాధనతో జ్ఞానం, సంపద లభిస్తుంది. బుధవారం, గణపతిని గరికతో పూజించడం ద్వారా సంపద, సుఖసంతోషాలు చేకూరుతాయి. ప్రతి బుధవారం గణేశునికి ఐదు గరికలను అర్పించడం ద్వారా జ్ఞానం పెరుగుతాయి. అలాగే, ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. బుధవారం పూట గణేశునికి ఆవు నెయ్యిలో సింధూరం కలిపిన తిలకాన్ని రాయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.
గణేష్ గాయత్రీ మంత్రాన్ని బుధవారం కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి. జ్ఞానానికి దేవుడైన గణేశుడిని బుధవారం పూజించడం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. బుధవారం గణేషును ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అలాగే, ఈ రోజున గణేషునిని ఆరాధించే ముందు, మోదకాలను సమర్పించాలి
అలాగే బుధవారం సింధూరం, గంధం, లడ్డూలు లేదా బెల్లం తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. గణేశుడికి నెయ్యి, బెల్లం అర్పించాలి. ఇంకా మోదకాలు సమర్పించి.. ఆ భోజనాన్ని ఆవుకు తినిపించడం ద్వారా సంపద చేకూరుతుంది.
జ్యోతిషశాస్త్రంలో గణేశుడిని కేతువు దేవతగా భావిస్తారు. ఏదైనా పని ప్రారంభించే ముందు గణేశుడిని పూజిస్తారు. ఇకపోతే ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి విగ్రహాన్ని ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులు ఇంటి లోపలికి రావు అని నమ్ముతారు.