Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై దాడులు చేయం.. ఉగ్రవాదుల్లో మానవత్వం

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దా

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (17:16 IST)
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దాడి చేయమని.. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకూ పేరుతో విడుదలైన ఆడియోలో ఉగ్రవాదులు ప్రకటన చేశారు. గత ఏడాది దాడులు జరగటంతో ఈసారి భద్రత పెంచింది ప్రభుత్వం. దీంతో భక్తుల్లో కూడా భయాందోళనలు ఉన్నాయి. 
 
ఈ సమయంలో ఉగ్రవాదులు చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ''మీకు భద్రత అవసరం లేదు. మీరు మా అతిథులు. వాళ్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు. మేం ఎలాంటి దాడి ప్రణాళిక రచించలేదని'' నైకూ ఆడియో ద్వారా తెలిపాడు. 
 
అమరనాథ్ యాత్రపై దాడులు చేయం అంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదుల్లోనూ మంచి వాళ్లు ఉంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ నుంచి హామీ వచ్చినా.. భద్రత విషయంలో రాజీ పడేది లేదని జమ్మూకాశ్మీర్ డీజీపీ వాయిద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments