Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ కోసమంటూ పక్కకొచ్చి.. నడుము తాకాడు.. నుష్రత్ భరూచా

దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అన్నీ రంగాల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఇక సినీ రంగానికి చెందిన తారలకు క్యాస్టింగ్ కౌచ్‌ పేరిట ఇబ్బందులు.. పబ్లిక్‌లోనూ

Advertiesment
సెల్ఫీ కోసమంటూ పక్కకొచ్చి.. నడుము తాకాడు.. నుష్రత్ భరూచా
, గురువారం, 14 జూన్ 2018 (11:01 IST)
దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అన్నీ రంగాల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఇక సినీ రంగానికి చెందిన తారలకు క్యాస్టింగ్ కౌచ్‌ పేరిట ఇబ్బందులు.. పబ్లిక్‌లోనూ వేధింపులు తప్పట్లేదు. తాజాగా సెల్ఫీ కోసమంటూ హీరోయిన్‌ పక్కన నిలబడిన ఓ అభిమాని.. మెల్లగా ఆమె నడుమును తాకాడు. ఈ చేదు అనుభవం హీరోయిన్ నుష్రత్ భరూచాకు జరిగింది. 
 
దీనిపై నుష్రత్ స్పందిస్తూ.. సెల్ఫీ దిగుతానంటూ వచ్చిన ఓ అభిమాని కోరికను కాదనలేక.. అతని పక్కన నిలబడ్డానని.. అయితే అతను చేసిన పనికి షాక్ అయ్యానని నుష్రత్ వాపోయింది. తెలుగులో శివాజీ సరసన ''తాజ్ మహల్'' సినిమాలో నటించిన ఈ భామ, పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వేళ, ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. 
 
ఫోటో దిగుతున్న సమయంలో అతను మరింత దగ్గరగా వచ్చి, తన నడుమును తాకాడని.. తాను దిగ్భ్రాంతికి గురవగా.. ఈలోగా ఈవెంట్ టీం సభ్యుడొకరు వచ్చి, సదరు యువకుడిని మందలించి, దూరం జరగాలని హెచ్చరించాడని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్ష‌న్‌లో రాజ్ త‌రుణ్‌.. స‌క్స‌స్ కోసం ఏం చేస్తున్నాడో తెలుసా..?