Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాసేపట్లో కన్నడ తీర్పు .. అధికార పీఠం ఎవరికో?

ఒక్క కర్ణాటక ఓటర్లు మాత్రమే కాకుండా దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Advertiesment
Karnataka Assembly Election Result 2018
, మంగళవారం, 15 మే 2018 (07:47 IST)
ఒక్క కర్ణాటక ఓటర్లు మాత్రమే కాకుండా దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా 72.36 శాతం పోలింగ్‌ నమోదైనందున త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలు అరుదని రాజకీయ పరిశీలకుల అంచనా.
 
కర్ణాటక శాసనసభలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా, వీటిలో 222 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం 38 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
 
ప్రధాన పక్షాలు కాంగ్రెస్‌, భాజపా, జనతాదళ్‌లో ఏ పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టారనేది మంగళవారం మధ్యాహ్నానికల్లా వెల్లడవనుంది. మాధ్యమ సంస్థల సర్వే ఫలితాల నిగ్గు తేలనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యూహాలకు కన్నడసీమ వేదికైంది. దక్షిణాదిలో పార్టీని ముందుకు నడపడానికి భాజపా అధ్యక్షుడు అమిత్‌షా వేసిన ఎత్తుల ఫలితాలు త్వరలో కళ్లకు కడతాయి. శక్తినంతా కూడదీసుకుని జనతాదళ్‌ అధ్యక్షుడు హెచ్‌.డి.దేవేగౌడ సాగించిన పోరాటమూ చరిత్రబద్ధం కానుంది. 
 
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ గెలిచి తిరిగి అధికారాన్ని కొనసాగిస్తుందా? లేదా కమలనాథులు విధానసౌధపై మరోసారి కాషాయ ధ్వజాన్ని ఎగరేసి దక్షిణాదిలో ప్రాబల్యాన్ని విస్తరిస్తారా? ప్రాంతీయ పక్షాలే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తాయంటూ ప్రచారం చేసిన జనతాదళ్‌కు జనాదరణ లభిస్తుందా? తదితర చిక్కుముళ్లు వీడనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధ్యాత్మిక పర్యటనలో జనసేనాని.. ఎందుకో తెలుసా? (Video)