Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైవ్: కర్ణాటక ఎన్నికల పోలింగ్.. బీజేపీ నేతల పూజలు.. అమిత్ షా కూడా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం కోసం బీజేపీ నేతలంతా తమదైన శైలిలో గోపూజలు చేస్తూ.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భా

Advertiesment
Karnataka Elections 2018 LIVE Updates
, శనివారం, 12 మే 2018 (10:25 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధించడం కోసం బీజేపీ నేతలంతా తమదైన శైలిలో గోపూజలు చేస్తూ.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప ఇంట్లో పూజలు నిర్వహించి ఆపై ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని కోరుతూ గురువానంద గురూజీ ఆశీర్వాదాన్ని అమిత్ షా పొందినట్టు జాతీయ మీడియా కోడైకూస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమాన్ని అమిత్ షా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించారు.
 
అంతకుముందు, ఆశ్రమంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించుకుని.. స్వామివారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీని కలిసేందుకు అమిత్ షా తన కుమారుడు, కోడలుతో కలిసి వెళ్లారు. సుమారు నలభై నిమిషాల పాటు గురూజీ వద్ద అమిత్ షా గడిపినట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం గురూజీ ఆశీర్వాదం పొందినట్టు ఆశ్రమ వర్గాల సమాచారం.
 
అలాగే జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి కుమారస్వామి జయానగర్‌లోని ఆదిచుంచనాగిరి మహాస్థాన మఠంలో నిర్మలానందానంత మహాస్వామిని కలిశారు. ఆయన ఆశీర్వాదం పొందారు. అలాగే బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఉపముఖ్యమంత్రి అభ్యర్థి బి.శ్రీరాములు.. తన ఓటు హక్కు వినియోగించుకునేముందు గోవు పూజ చేశారు.
 
మరోవైపు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. హసన్ జిల్లా హొళెనరసిపురలో దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మలు తమ ఓట్లు వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంత డబ్బుతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారు: చంద్రబాబు కితాబు