Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యావత్‌ భారతావనికి తెలంగాణ దిక్సూచి : సీఎం కేసీఆర్

భారతదేశ చరిత్రలోనే ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, రైతులకు పెట్టుబడి స

Advertiesment
Telangana
, గురువారం, 10 మే 2018 (16:14 IST)
భారతదేశ చరిత్రలోనే ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కిందన్నారు. రైతులకు ఇచ్చే డబ్బు బ్యాంక్‌లో ఉంది. వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు ఇచ్చే డబ్బు రూ.6 వేల కోట్లు బ్యాంకులో ఉన్నాయని సీఎం వెల్లడించారు.
 
రైతు పెట్టుబడి కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. పెట్టుబడి సహాయం సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని రైతులను కోరారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి.. నీళ్లుండాలి.. కరెంట్ ఉండాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేసినం, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఈ సంవత్సరం నుంచి పంట పెట్టుబడి కూడా అందజేస్తున్నామన్నారు. 
 
అదేసమయంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం కేంద్ర ప్రభుత్వం భరించాలి.. సగం రైతు భరించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల మాటలు వింటే ఆగమవుతరు. ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి టీ కాంగ్రెస్ నేతలు వ్యవసాయాన్ని నాశనం చేశారని సీఎం విమర్శించారు.
webdunia
 
పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరే ఉంటుంది కానీ అనుభవదారు పేరుండదని సీఎం స్పష్టం చేశారు. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో పాస్‌బుక్కులు తీసుకోవద్దన్నారు. కౌలు రైతులకు డబ్బు ఇవ్వమన్నారు. కోటి 40 లక్షల ఎకరాల పైచిలుకు భూమి సాగుకు అనుకూలంగా ఉందని తేలింది. చెక్కులు అందజేయడంలో ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలని రైతులకు సీఎం సూచించారు. 
 
వచ్చే నెల రెండో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పోను మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎం తెలిపారు. పోస్టులోనే రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్‌బుక్కులు ఇంటికొస్తయన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసినమని, కనివినీ ఎరగని రీతిలో భూరికార్డుల ప్రక్షాళన చేసినమని అన్నారు. 58 లక్షల మంది రైతులకు పాస్‌బుక్కులు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనంతపురమా? తిరుపతా?