Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#KarnatakaVotesForCongress కాంగ్రెస్‌కు 120పైగా సీట్లు వస్తాయ్.. యడ్డీ పాపం: సిద్ధరామయ్య

ర్ణాటకలో మరోసారి కాంగ్రెస్‌దే విజయమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వరుణలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం… పోలింగ్ చూసి బీజేపీ నేతలు షాకవుతున్నారని చెప్పారు. ఎంత ఎక్కువ పోలింగ్ నమోదు అయితే అంత క

#KarnatakaVotesForCongress కాంగ్రెస్‌కు 120పైగా సీట్లు వస్తాయ్.. యడ్డీ పాపం: సిద్ధరామయ్య
, శనివారం, 12 మే 2018 (15:06 IST)
కర్నాటక రాష్ట్రంలో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రతి బూత్ దగ్గర ఓటర్లు బారులుతీరి ఉన్నారు. వేసవి కాలం కావడంతో సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరుగనుంది. 
 

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాత ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ప్రముఖులందరూ ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేడీఎస్ అధినేత మాజీ పీఎం దేవెగౌడ హసన్ జిల్లా హోలినరిసిపూర్ పట్టణంలో ఓటు వేశారు. 
 
మైసూర్ యువరాజు కృష్ణదత్ మైసూర్‌లో ఓటు వేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేశారు. కనకపురలో శ్రీశ్రీ రవిశంకర్, రమణఘరలో జేడీఎస్ నేత కుమారస్వామి కుబుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకన్నారు. 
 
ఇక కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్‌దే విజయమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వరుణలో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం… పోలింగ్ చూసి బీజేపీ నేతలు షాకవుతున్నారని చెప్పారు. ఎంత ఎక్కువ పోలింగ్ నమోదు అయితే అంత కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందన్నారు. కాంగ్రెస్‌కు 120పైగా సీట్లు వస్తాయని.. యడ్యూరప్ప మానసిక వేదనలో వున్నారని చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి బాబు ఆరా.. అస‌లు విష‌యం లీక్ చేసిన ముర‌ళీమోహ‌న్..!