నీ ముందు రోబోలు బాలాదూర్.. రోబోలకే తాతవు : ఆనంద్ మహీంద్రా వీడియో షేర్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:36 IST)
దేశ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన తన సామాజిక మాద్యమంలో షేర్ చేసే వీడియోలు చాలా ఫన్నీగానూ, కొత్తగానూ ఉంటాయి. మరికొన్ని ఆలోచింప‌జేసేవిగా ఉంటాయి. 
 
అయితే, ఆయ‌న ఏ వీడియో షేర్ చేసినా.. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది. అందుకే.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు ఫాలోయింగ్ ఎక్కువ‌. ఆయ‌న ఏదైనా ట్వీట్ చేస్తే చాలు.. వీడియో పెడితే చాలు ఆ ట్వీట్‌ను నెటిజన్లు క్ష‌ణాల్లో వైర‌ల్ చేసేస్తారు. 
 
తాజాగా ఆనంద్ మ‌హీంద్ర ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ దోశ బండి ద‌గ్గ‌ర దోశ‌లు వేసే వ్య‌క్తి స్కిల్ గురించి చెప్పుకొచ్చారు. "నీ ముందు రోబోలు ఏం ప‌నిచేస్తాయి.. రోబోల‌కే తాత‌వు నువ్వు.." అంటూ ఆనంద్ మ‌హీంద్ర వీడియోను షేర్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఆ వీడియోలో దోశ వేసే వ్య‌క్తి.. చాలా ఫాస్ట్‌గా దోశ‌లు వేస్తుంటాడు. దోశ‌లు ఎంత ఫాస్ట్‌గా అంటే.. అటు చూసి ఇటు చూసేలోపు.. దోశ‌లు ప్లేట్‌లో ప‌డిపోతున్నాయి. ఆ వీడియోకు ఫిదా అయిపోయిన ఆనంద్ మ‌హీంద్రా.. నీ స్కిల్ ముందు రోబోలు ఏం ప‌నిచేస్తాయి. 
 
వాటిక‌న్నా స్పీడ్‌గా ప‌నిచేసి వాటి ప‌నిని స్లో చేశావు. ఆయ‌న ప‌నిని చూసి నేనే అల‌సిపోయా.. కానీ.. అత‌డు ఎంతో ఉత్సాహంతో దోశ‌లు వేస్తున్నాడు. ఆయ‌న దోశ‌ల‌ను చూసి నాకు కూడా ఆక‌లివేస్తోంది.. అంటూ ట్వీట్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments