దేశ ఐటీ రాజధానిగా ఉన్న సిలికాన్ వ్యాలీ (బెంగుళూరు) నగరానికి కొత్త పేరు పెట్టేందుకు నెటిజన్లు పోటీపడ్డారు. వీరంతా కలిసి ఓ సరికొత్త పేరును సూచించారు. కర్నాటక రాష్ట్ర రాజధానిగా ఉన్న బెంగళూరుకు కొత్త పేరు సూచించేందుకు పోటీ పడాలని మహేంద్ర సంస్థ చైర్మన్ ఆనంద్‌మహేంద్ర పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
దీంతో నెటిజన్లు ఎన్నో పేర్లను సూచించారు. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులలో ఒకరైన నందన్ నీలేకణి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నగరానికి చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి టెక్‌హళ్లిగా సూచించారు. ఇందుకు ఆనంద్ మహేంద్రతోపాటు నందన్ నీలేకణి సుముఖత వ్యక్తం చేశారు.
టెక్‌హళ్లి అనే పదంలో టీఈసీ తర్వాత హెచ్‌ను కేపిటల్ లెటర్‌గా ప్రయోగించారు. తద్వారా ఒకే అక్షరం రెండు పదాలకు అర్థం వచ్చేలా ఉంది. ఈ పోటీలో విజేతగా నిలిచిన శ్రీనివాస రెడ్డికి పినిన్‌ఫరీనా హెచ్ 2 స్పీడ్ కారును బహుమతిగా అందజేయనున్నారు. దీన్ని స్వీకరించేందుకు చిరునామా పంపాలని ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ ద్వారా శనివారం కోరారు. టెక్‌హళ్లి అంటే సాంకేతిక గ్రామం అని అర్థం.