Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్‌లెస్‌ ఫోటో పోస్ట్ చేసిన హీరో వైఫ్... గర్వంగా ఫీలైన హీరో

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:34 IST)
సెలబ్రిటీలు, సామాన్యులు అంటూ తేడా లేకుండా దాడి చేస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది ప్రముఖులు దీని బారినపడి కష్టమైన ట్రీట్మెంట్ దశను ధైర్యంగా దాటుకుని బయటపడ్డారు. ఆ తర్వాత కొంతమంది సంతోషంగా జీవిస్తూ ఉంటే మరికొందరు దీని గురించి అవగాహన కల్పించడానికి పోరాడుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యకు క్యాన్సర్ స్టేజ్ 0 సోకినట్లు గత ఏడాది నవంబర్‌లో నిర్ధారణ అయ్యింది. ఆమె పేరు తాహీరా కశ్యప్, అప్పటి నుండి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ పొందుతోంది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆవిడ చేసిన ట్వీట్ హృదయాలను హత్తుకునే విధంగా ఉంది. 
 
"ఈరోజు నాది! అందరికీ ప్రపంచ క్యాన్సర్ డే శుభాకాంక్షలు, ఈ రోజును మనమంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఒంటిపై ఉన్న ఈ మచ్చలను గౌరవ చిహ్నాలుగా భావిస్తున్నాను. ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం నా నిర్ణయం, ఎందుకంటే ఈ సందర్భంగా నేను నా వ్యాధిని కాకుండా దానిపై నా పోరాట స్ఫూర్తిని తెలియజెప్పాలనుకుంటున్నాను" అంటూ టాప్‌లెస్‌గా గుండుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 
 
దీనిపై స్పందిస్తూ ఖురానా "ఈ మాటలు నీకోసమే తాహిరా.. ఈ మచ్చలు చాలా అందంగా ఉన్నాయి.. ఇలాగే నువ్వు కోట్ల మందిని తమ యుద్ధాలను ధైర్యంగా కొనసాగించడానికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments