Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రెండింగ్- సెల్ఫీ విత్ స్లిప్పర్... అమితాబ్ ఏమన్నారంటే?

Advertiesment
Selfie With Slipper
సెల్ఫీల కోసం ఎగబడే వారు రోజు రోజుకీ పెరిగిపోతోంది. సెల్ఫీ కోసం ఎంతటి సాహసానికైనా తెగబడుతున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా కొందరు తీసుకునే సెల్ఫీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిన్నారుల సెల్ఫీ మాత్రం స్మార్ట్ ఫోన్ తీసుకోకుండానే వైరల్ అవుతోంది.


అదెలాగంటే.. ఓ చెప్పుతో చిన్నారులు సెల్ఫీ తీసుకునే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలెబ్రిటీలు కూడా ఈ ఫోటో స్పందిస్తున్నారు.
 
బాలీవుడ్ సెలబ్రిటీలు అనుపమ్ కేర్, సునీల్ శెట్టి, అతుల్ కస్బేకర్, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ లాంటి వారు ఈ సెల్ఫీపై కామెంట్స్ చేశారు. ఈ చిన్నారుల అమాయకత్వం, ఉన్నదాంట్లో సంతృప్తి పడే గుణానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. అయితే బిగ్ బి మాత్రం భిన్నంగా స్పందించారు. తనను క్షమించాలని అడుగుతూ.. ఈ ఫోటో ఫోటోషాప్ చేసిందనుకుంటా. 
 
ఎందుకంటే.. ఆ పిల్లాడు చెప్పును పట్టుకున్న చేయి.. అతడి మిగితా శరీర భాగాలకు సరితూగడం లేదు.. అంటూ ట్వీట్ చేశారు. బిగ్ బి ట్వీట్ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఆ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?