Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ : బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు...

Advertiesment
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ : బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు...
, శుక్రవారం, 9 నవంబరు 2018 (15:50 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "థగ్స్ ఆఫ్ హిందుస్థాన్". ఈ చిత్రం విడుదలైన తొలి రోజే బాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టింది. 
 
హిందీ సినిమా చరిత్రలో తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కేవలం హిందీ వర్షెనే తొలి రోజు రూ.50.75 కోట్లు వసూలు చేయగా.. తెలుగు, తమిళ్ వర్షెన్లు కలిపితే ఈ మొత్తం రూ.52.25 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
దీపావళి సెలవులు, సినిమా రిలీజ్‌కు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ కావడం, రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవడం ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డుకు కలిసొచ్చిందని ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఏ హిందీ మూవీ కూడా తొలి రోజు రూ.50 కోట్ల వసూళ్లు సాధించలేదు. 
 
అయితే మూవీకి అంత మంచి రీవ్యూలు రాకపోవడంతో వీకెండ్ కలెక్షన్లు ఇవే స్థాయిలో ఉంటాయా లేదా అన్నదానిపై ఆదర్శ్ సందేహం వ్యక్తం చేశారు. అలాగే, ఈ చిత్రంలో వీరి నటనకు అద్భుతమైన ప్రసంశలు కూడా వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ సరసన హ్యూమా ఖురేషి... నిరాశలో అనుష్క...