మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (15:18 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మమతా బెనర్జీకి ఓ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో శనివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ జరుగనుంది. ఈ ర్యాలీకి రాహుల్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
 
దేశలోని కోట్లాది మంది ప్రజలు ఆగ్రాహావేశాల కారణంగానే ఈ విపక్షాలు ఏకం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వపు బూటకపు హామీలు, అబద్ధాలతో మోసపోయారని వ్యాఖ్యానించారు. 
 
మహిళలు, చిన్నారులు, కులం, మతం, భాష అన్న తేడా లేకుండా అందరి మాటకు గౌరవం ఇచ్చే రేపటి భారతం కోసం విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని రాహుల్ పునరుద్ఘాటించారు. హక్కులు, భావజాలాల పరిరక్షణలో బెంగాలీలు ఎప్పుడూ ముందుంటారని రాహుల్ ప్రశంసించారు. 
 
కాగా, ఈ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. మోడీ వ్యతిరేక పక్షాలు నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కేసీఆర్, జగన్ మినహా మిగిలిన పక్షాలన్నీ వస్తున్నాయంటూ బాబు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments