Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: రాహుల్ గాంధీ

Advertiesment
Rahul Gandhi
, శనివారం, 12 జనవరి 2019 (12:06 IST)
కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన న్యాయమైన హామీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్మరించారని.. మనం కలిసి ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మోదీకి, కేంద్ర సర్కారుకు అర్థమయ్యేలా చెప్పాలని రాహుల్ గాంధీ దుబాయ్‌లో అన్నారు. 
 
దుబాయ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. భారతీయ కార్మికులను కలిసి వారితో పలు అంశాలపై ముచ్చటించారు. గత ఏడాది ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఏపీ నేతల ఆందోళన సందర్భంగా తాను ప్రత్యేక హోదాపై ప్రకటన చేశానని.. దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 
 
విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం జరగాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దుబాయ్‌ అభివృద్ధిలో భారతీయ కార్మికుల పాత్ర కీలకమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కొనియాడారు. దుబాయ్‌లో ఉన్న రాహుల్.. భారత పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయాభివృద్ధికి సహకరించాలని వారిని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాజ్‌పేయి ఎక్కడ.. మోదీ ఎక్కడ? స్టాలిన్ ఎద్దేవా