డియర్ బెనర్జీ... దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:18 IST)
పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపినందుకుగాను ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన ఇండో-అమెరికా శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. అభిజిత్‌పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. ముఖ్యంగా, అభిజిత్‌ ఫ్రొఫెషనలిజంపై గోయల్‌ ప్రశ్నలు లేవనెత్తడాన్ని రాహల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 'డియర్‌ బెనర్జీ.. ఈ దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి. వారికి ఫ్రొఫెషనల్‌ అంటే ఏంటో తెలీదు. మీరు దాని గురించి వారికి వివరించలేరు. దశాబ్దాల పాటు ప్రయత్నించినా అది వృథా ప్రయాసే అవుతుంది. మీ కృషి పట్ల లక్షలాది మంది భారతీయులు గర్విస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అంటూ అందులో పేర్కొన్నారు.
 
అభిజిత్‌ వామపక్షవాది అని, ఆయన ప్రతిపాదించిన 'న్యాయ్‌' పథకం ఎన్నికల్లో తిరస్కరణకు గురైందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అభిజిత్‌తో పాటు.. రాహుల్ గాంధీ కూడా తోసిపుచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments