Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకు దాడి చేశామంటే... సర్జికల్ స్ట్రైక్-2పై క్లారిఫికేషన్...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (12:24 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాలు మెరుపుదాడులు చేయడానికి గల కారణాలను భారత విదేశాంగ శాఖ వివరించింది. ఇదే అంశంపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సర్జికల్ స్ట్రైక్-2కు గల కారణాలను వివరించారు. 
 
పుల్వామా భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన తర్వాత, పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందని ఆశించామని, కానీ, ఆ దేశం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతోనే లక్షిత దాడులు చేయాల్సి వచ్చిందని వివరించారు. 
 
పైపెచ్చు.. భారత్‌లో మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే ఉగ్ర సంస్థ ప్లాన్ చేస్తున్నారన్న పక్క సమాచారంతోనే మెరుపు దాడులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాంటి దారుణాలకు పాల్పడకముందే వారిని మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చామని ఆయన వివరించారు. 
 
మిరాజ్ యుద్ధ విమానాలతో జరిపిన ఈ దాడులు బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిబిరంపై జరిగినట్టు తెలిపారు. ఈ దాడుల్లో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని, ఆ సంఖ్యపై తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని చెప్పారు. ఈ దాడుల వల్ల సామాన్య ప్రజానీకానికి ఎలాటి ప్రాణహాని కలగలేదన్నారు. కేవలం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్టు తెలిపారు. 
 
పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతు లేనిదే ఉగ్రవాద దాడులు జరగబోవని ప్రపంచం మొత్తానికీ తెలుసునని, ఐఎస్ఐ అండ చూసుకుని రెచ్చిపోయే ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే తీరుతామని, అందులో భాగంగానే యుద్ధ విమానాలతో దాడులకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఇంకా వందల కొద్దీ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, ఒక్కో చోట పదుల సంఖ్యలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని గోఖలే వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments