Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిపై కారప్పొడి దాడి... ఎక్కడ.. ఎవరు?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:13 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కారప్పొడి దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, సాక్షాత్తూ ఢిల్లీ సచివాలయంలోనే ఈ దాడి జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కారప్పొడితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో కాపుకాచి అక్కడే ఉన్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సీఎం చాంబర్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కళ్లజోడు కూడా పగిలిపోయింది. 
 
కాగా, నిందితుడు అనిల్ కుమార్ భార్య సచివాలయంలోనే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్నది తెలియడంలేదు. కాగా, ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆప్ పార్టీ విమర్శించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments