Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాడ్‌ఫాదర్లు లేకపోవడం వల్లే ఛాన్సుల్లేవ్...

తనకు సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్లు లేకపోవడం వల్లే సరైన అవకాశాలు దక్కడం లేదని ఢిల్లీ భామ తాప్సీ అంటోంది. "ఝమ్మంది నాదం" సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ ఢిల్లీ సుందరి... ఆ తర్వాత పలు తెలుగు హిట్, తమిళ హ

Advertiesment
గాడ్‌ఫాదర్లు లేకపోవడం వల్లే ఛాన్సుల్లేవ్...
, సోమవారం, 16 జులై 2018 (10:40 IST)
తనకు సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్లు లేకపోవడం వల్లే సరైన అవకాశాలు దక్కడం లేదని ఢిల్లీ భామ తాప్సీ అంటోంది. "ఝమ్మంది నాదం" సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ ఢిల్లీ సుందరి... ఆ తర్వాత పలు తెలుగు హిట్, తమిళ హిట్ సినిమాల్లోనూ కనిపించింది. పింక్ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. తాజాగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో షేర్ చేసుకుంది.
 
"నాకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. పైగా, గాఢ్‌పాదర్లంటూ ఎవరూ లేరు. అందుకే చాలా సినిమాల్లో నేరుగా కాకుండా.. ఇతరుల స్థానంలో అవకాశాలు వచ్చాయి. సంబంధం లేని కారణాలతో జరిగే తిరస్కరణకు నేను సిద్ధమయ్యా. పాత్రకు సరిపోతానా? లేదా? అన్న విషయం తప్ప.. మిగితా ఏ కారణం వల్లనైనా సినిమా కోల్పోతే నాకు ఆశ్చర్యమేమి కలగదని చెప్పుకొచ్చింది. 
 
పైగా, నేను సినీ పరిశ్రమకు చెందిన వారి కూతురినో, సోదరినో కాదు. వేరొకరి స్థానంలో నన్ను ఎంపిక చేస్తే నేను ఆ జోన్‌లోకి వెళ్లిపోతా. ఎందుకంటే ఇది నా లక్ష్యం. ఈ పని చేసేది నేనొక్కదాన్నే. నా రెండు, మూడు సినిమాలు బాగా లేకపోతే.. ఎవరూ నాకు అవకాశం ఇవ్వరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే అభద్రతా భావంతో ఉంటా. ఇవన్నీ పక్కన పెడితే నా వరకు నేను చిన్న విజయం అయినా ఎంజాయ్ చేస్తున్నా. నా ప్రయాణాన్ని థ్రిల్లింగ్‌గా కొనసాగిస్తున్నట్టు చెప్పుకొచ్చింది తాప్సీ. కాగా, గతంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై అనవసర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిప్ లాక్ వద్దునుకున్నా.. మూడు సినిమాలు పోయాయ్.. కౌగిలింత సీన్...?