Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్ లాక్ వద్దునుకున్నా.. మూడు సినిమాలు పోయాయ్.. కౌగిలింత సీన్...?

''ప్రేమమ్'' స్టార్ హీరోయిన్, కేరళ కుట్టి మడోన్నా సెబాస్టియన్.. లిప్ లాక్ సీన్స్, గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా వుంటుంది. గ్లామర్ డోస్ పెంచే సన్నివేశాలంటే ఆమడ దూరంలో నిలిచిపోతుంది. ఇలా లిప్ లాక్‌లకు

Advertiesment
లిప్ లాక్ వద్దునుకున్నా.. మూడు సినిమాలు పోయాయ్.. కౌగిలింత సీన్...?
, సోమవారం, 16 జులై 2018 (09:50 IST)
''ప్రేమమ్'' స్టార్ హీరోయిన్, కేరళ కుట్టి మడోన్నా సెబాస్టియన్.. లిప్ లాక్ సీన్స్, గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా వుంటుంది. గ్లామర్ డోస్ పెంచే సన్నివేశాలంటే ఆమడ దూరంలో నిలిచిపోతుంది. ఇలా లిప్ లాక్‌లకు మడోన్నా అంగీకరించకపోవడంతో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మూడు సినిమాలు వదులుకున్నానని మడోన్నా వెల్లడించింది. 
 
ప్రస్తుతం విజయ్ సేతుపతితో ''జుంగా'' మూడోసారి కలిసి నటిస్తున్న మడోన్నా.. ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విజయ్ సేతుపతి చిత్రంలో తాను కనిపించేది ఐదు నిమిషాలే అయినా.. అది ప్రేక్షకుల మదిలో గుర్తిండిపోతుందని తెలిపింది. లిప్ లాక్ సన్నివేశాలకు తాను వ్యతిరేకమని... తొలిసారి కౌగిలింత సీన్ చేసేందుకు ఏడ్చేశానని తెలిపింది.
 
తనకు బిడియం ఎక్కువని.. బయటివారితో మాట్లాడేందుకు భయపడే రకమని వెల్లడించింది. పురుషులతో సమానంగా స్త్రీలను గౌరవించే సమాజాన్ని తాను కోరుకుంటానని తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తున్నానని.. భాషా సమస్య రాలేదని మడోన్నా సెబాస్టియన్ వెల్లడించింది.
 
ప్రేమ వ్యవహారం తన వ్యక్తిగత అంశమని, దానిపై బహిరంగ వ్యాఖ్యలు చేయనని చెప్పిన ఈ భామ, తెలుగు 'ప్రేమమ్'లోనూ తళుక్కుమన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సేతుపతి తనకు స్ఫూర్తి అని, తన కుటుంబంలో ఒకరిగా విజయ్ సేతుపతి భావిస్తానని.. సహ నటుడిగా కాకుండా మంచి వ్యక్తిగా వ్యవహరిస్తాడని మడోన్నా తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్-2 నుంచి భానుశ్రీ ఔట్.. బోరున విలపించిన సునయన