Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో వున్నాను.. పిల్లలు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటా: తాప్సీ

అందాల రాశి తాప్సీ ప్రేమలో వుంది. కానీ తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. మనం ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండేందుకు వివాహం చేసుకోవాల్సిన అవసరం

Advertiesment
Taapsee Pannu
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:46 IST)
అందాల రాశి తాప్సీ ప్రేమలో వుంది. కానీ తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. మనం ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండేందుకు వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని తాప్సీ చెప్తోంది. దక్షిణాది, ఉత్తరాది సినిమాల్లో తళుక్కుమంటున్న తాప్సీ.. హిట్స్ మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోతోంది. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా తాప్సీ నటించిన 'మన్మర్జియా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ తన ప్రేమ, పెళ్లి గురించి నోరు విప్పింది. చాలాకాలంగా తాప్సీ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉందని వస్తున్న వార్తలపై స్పందించింది.
 
తాను ప్రేమలో వున్న మాట నిజమే కానీ పెళ్లికి మాత్రం ఇంకా సమయం వుందని తెలిపింది. ఇప్పటికిప్పుడే తన పెళ్లి జరగదని.. తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. అంతేకాకుండా పెళ్లికి ముందే పిల్లల్ని కననని తేల్చి చెప్పింది. మనం ప్రేమించే వ్యక్తితో సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా..? అంటూ ఎదురుప్రశ్న వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం.. మంచివాళ్లకు ఎఫైర్స్ వుండవా? పుండు మీద కారం చల్లిన శ్రీరెడ్డి