Webdunia - Bharat's app for daily news and videos

Install App

హలో మేడమ్.. కాలికి దెబ్బ తగిలింది.. కాస్త మందులేస్తారా? ఫార్మసీలోకి శునకం (Video)

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (16:14 IST)
విశ్వాసానికి మారుపేరు శునకం. ఆ శునకం మనుషుల భాషల్ని అర్థం చేసుకోగలదు. వారిని అనుసరించగలదు. ఇలా ఓ శునకం తనకు దెబ్బ తగలడంతో నేరుగా మందుల షాపులోకి వెళ్లింది. అంతటితో ఆగకుండా ఫార్మసీలోని మహిళా ఉద్యోగి వద్ద తనకు మందులేస్తారా అన్నట్లు నిల్చుంది. అలా తన ఫార్మసీకి వచ్చిన శునకానికి దెబ్బ తగిలిన చోట మందులేసిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలో చెంగిస్ అనే మహిళ.. ఫార్మసీని నడుపుతోంది. మూగజీవులంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ మేరకు తన షాపులో వీధి శునకాల కోసం పడకలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఓ శునకం ఆయన షాపులోకి వచ్చింది. 
 
అయితే శునకం ఫార్మసీలో నిద్రించేందుకు రాలేదు. చెంగిస్‌ను అదేపనిగా చూస్తుండిపోయింది. వెంటనే ఆ శునకంతో చెంగిస్ మాట్లాడటం ప్రారంభించింది. అప్పుడే ఆ శునకం కాలికి దెబ్బతగిలివుండటాన్ని గమనించింది. ఆపై చికిత్స కూడా చేయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చెంగిస్ పోస్టు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలై కూర్చుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments