Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసికందును మట్టిలో పాతిపెట్టారు.. శునకం కాపాడింది.. ఎలాగంటే?

Advertiesment
పసికందును మట్టిలో పాతిపెట్టారు.. శునకం కాపాడింది.. ఎలాగంటే?
, శనివారం, 18 మే 2019 (11:52 IST)
థాయ్‌లాండ్‌‍లో కన్నతల్లి చేతులారా మట్టిలో పాతిపెట్టబడిన పసికందును ఓ శునకం రక్షించింది. తాను గర్భవతిని అయ్యానని.. 15 ఏళ్లలోనే పాపాయికి జన్మనిచ్చానని తెలిస్తే.. తల్లిదండ్రుల కోపానికి కారణమవుతానని జడుసుకున్న 15 ఏళ్ల యువతి.. తనకు పుట్టిన పసికందును ప్రాణాలతో మట్టిలో పాతిపెట్టింది.


థాయ్‌లాండ్‌లోని పెన్ నాంగ్ కామ్ అనే గ్రామంలో పింగ్ పాంగ్ అనే శునకం... పాపాయిని మట్టిలో పాతిపెట్టిన ప్రాంతాన్ని చూసి మొరగడం చేసింది. ఇంకా ఆ మట్టిని తవ్వింది. 
 
దీన్ని గమనించిన ఆ శునకం యజమాని.. ఆ మట్టి నుంచి శిశువు కాలు బయటికి రావడం చూసి షాకయ్యాడు. వెంటనే మట్టిలో పాతిపెట్టిన పసికందును చేతికి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువు పరీక్షించిన వైద్యులు పాపాయి ఆరోగ్యంగా వుందని.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక పింగ్ పాంగ్ అనే శునకం యజమాని పట్ల విశ్వాసంతో నడుచుకుంటుంది. 
webdunia
 
కానీ ఇటీవల ఓ కారు ప్రమాదంలో పింగ్ పాంగ్ ఓ కాలు పని చేయకుండా పోయిందని శునకం యజమాని తెలిపారు. ఆ గ్రామంలో వున్న వారందరికీ పింగ్ పాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక పింగ్ పాంగ్ కనిపెట్టిన ఆ శిశువు తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ శిశువును ఆ యువతి తల్లిదండ్రులే పెంచాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాడ్సే ఉగ్రవాదే.. అతనిని దేశభక్తుడిగా చూసేవారూ ఉగ్రవాదులే: సిద్ధరామయ్య