Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిండు గర్భిణి.. తాగేందుకు నీళ్లడిగింది.. అంతే పొట్టను కోసి శిశువును తీశారు..

Advertiesment
నిండు గర్భిణి.. తాగేందుకు నీళ్లడిగింది.. అంతే పొట్టను కోసి శిశువును తీశారు..
, శుక్రవారం, 17 మే 2019 (14:52 IST)
తొమ్మిది నెలల గర్భవతి తన మూడేళ్ల కుమారుడిని తీసుకెళ్లేందుకు డే కేర్ సెంటర్‌కు కారులో బయల్దేరింది. కానీ ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఆమె కుటుంబ సభ్యులకు కాల్ వచ్చింది. ఆమె డే కేర్ సెంటర్‌కి రాలేదనీ, తన మూడేళ్ల కొడుకును తీసుకెళ్లలేదనీ వాళ్లు చెప్పారు.


అయితే లోపెజ్‌కు ఏమైందనే విషయం మిస్టరీగా మారింది. నెల రోజులు గడుస్తున్నా.. ఆచూకీ తెలియకపోవడంతో లోపెజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక లోపెజ్ కుమారుడు రాక్వెల్ తల్లిని చూడాలని ఏమీ తినట్లేదని బాధపడుతూ చెప్పింది. ఆమె కిడ్నాప్‌కు గురై వుంటుందని అందరూ భావించారు.
 
కానీ వారి ఆశలు సమాధి అయ్యాయి. చికాగోలోని ఓ ఇంటి బయట వున్న చెత్తకుప్పలో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. అవి లోపెజ్‌వేనని తెలిసింది. ఆమె కడుపులో పెరుగుతున్న శిశువును ఎవరో ఎత్తుకుపోయారని తేలింది. లోపెజ్‌ను మెడచుట్టూ తాడు బిగించి చంపేశారని పోస్ట్‌మార్టం రిపోర్టులో స్పష్టమైంది. ఇంకా విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. గర్భిణి అయిన లోపెజ్‌ను క్లారిసా అనే మహిళ చంపేసిందని తేలింది. ఈ హత్యలో ఆమె బాయ్‌ఫ్రెండ్ బోబాక్, ఆమె కూతురు డిసైరీలు కూడా వున్నట్లు తేలింది. 
 
ఇంతకీ నిండు గర్భిణీని ఎందుకు హత్య చేశారంటే.. క్లారిసా 27 కొడుకు 2017లో చనిపోయాడు. అప్పటి నుంచీ ఆమెకు ఓ కొడుకు ఉంటే బాగుండనే కోరిక బలంగా కలిగింది. అలాంటి సమయంలో ప్రెగ్నెన్సీతో ఉన్న లోపెజ్ ఆమె ఇంటి ముందు కారు ఆపి నీళ్లు కావాలని అడిగింది. అలా ఆమెకు వాటర్ అందించిన క్లారిసా... తొమ్మిదో నెల అని తెలుసుకుంది. 
 
రెండ్రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పారని.. కడుపులో మగబిడ్డ పెరుగుతున్నాడని వెల్లడించింది. అంతే... ఆ బిడ్డపై కన్నేసిన క్లారిసా, ఆమె కూతురు కలిసి ఇంట్లోనే లోపెజ్‌ను చంపేశారు. పొట్టను కోసి మగబిడ్డను తీశారు. కానీ శిశువు గిలగిల కొట్టుకోవడంతో ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆ పసికందును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆ మగ బిడ్డకు బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదని డాక్టర్లు తెలిపారు.
 
లోపెజ్‌ మృతదేహాన్ని కొన్ని రోజులు ఐస్‌లో ఉంచిన హంతకులు ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి... శరీర భాగాల్ని చెత్త కుప్పలో పడేశారు. ఇందుకు క్లారిసా బాయ్ ఫ్రెండ్ బోబాక్ సహకరించాడని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలిని పడకసుఖం ఇవ్వమన్న మామ.. భర్తకు చెప్పినా పట్టించుకోలేదనీ...