Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీలో చేరిన రాజ‌మండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆకుల‌ సత్యనారాయణ...

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (17:56 IST)
300 కార్లతో రాజ‌మండ్రి నుంచి విజ‌య‌వాడ‌కు ర్యాలీగారాజ‌మండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ, ఆయ‌న స‌తీమ‌ణి శ్రీమ‌తి ఆకుల ల‌క్ష్మీ ప‌ద్మావ‌తి సోమవారం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జ‌న‌సేన పార్టీలో చేరారు. విజ‌య‌వాడ‌లోని ప‌రిణ‌య క‌ళ్యాణ వేదిక‌లో ఈ కార్యక్రమం జరిగింది. వేలాది మంది అనుచ‌రుల‌తో క‌ల‌సి జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గారి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. శ్రీ ఆకుల స‌త్య‌నారాయ‌ణ, శ్రీమతి ల‌క్ష్మీ ప‌ద్మావ‌తిల‌కు పార్టీ అధినేత కండువా క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
ఆయ‌న్ని మ‌న‌స్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్టు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు తెలిపారు. 2014 ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి అర్బ‌న్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన శ్రీ ఆకుల స‌త్య‌నారాయ‌ణ, జ‌న‌సేన పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రాథమిక స‌భ్య‌త్వానికీ రాజీనామా చేశారు. అంత‌కుముందు శ్రీ ఆకుల సత్యనారాయణ దాదాపు 300 కార్లు, వెయ్యి మంది జనసేన కార్యకర్తలు అభిమానులతో క‌ల‌సి భారీ ర్యాలీగా విజ‌య‌వాడ‌కి త‌ర‌లివ‌చ్చారు. 
 
 
న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి చేరిక‌లు
 
అంత‌కుముందు పార్టీ కార్యాలయంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌త్స్య‌కార సంఘం నాయ‌కుడు శ్రీ బొమ్మిడి నాయ‌క‌ర్ త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి జ‌న‌సేన పార్టీలో చేరారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు కండువా క‌ప్పి ఆయ‌న్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఉభ‌య‌ గోదావ‌రి జిల్లాల అగ్నికుల క్ష‌త్రియ సంఘం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న శ్రీ నాయ‌క‌ర్ 2009 నుంచి న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీలో కీల‌క నేత‌గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments