Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ 'యోగి' పరిపూర్ణానందకు భాజపా తీర్థం... యూపీలా టీజీ అవుతుందా?

తెలంగాణ 'యోగి' పరిపూర్ణానందకు భాజపా తీర్థం... యూపీలా టీజీ అవుతుందా?
, శనివారం, 20 అక్టోబరు 2018 (16:22 IST)
అందరూ అనుకున్నట్లుగానే శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. రాంమాధవ్‌తో పాటుగా శుక్రవారం ఢిల్లీ వెళ్లిన పరిపూర్ణానంద బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 
 
దేశం ఉనికి ధర్మం మీదే ఆధారపడి ఉందని, నేడు ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అందుకే బీజేపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. హిందూ సంస్కృతి కాపాడటంలో బీజేపీ చేస్తున్న కృషి తనకు నచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కల  సాకారం చేసేందుకు బీజేపీ చేస్తోన్న కృషి తనను ఆలోచింప చేసిందని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తగానే బీజేపీలో చేరుతున్నానని, మోదీ, అమిత్ షా, రాం మాధవ్‌ల నిర్ణయమే తనకు శిరోధార్యమని పరిపూర్ణానంద స్పష్టం చేశారు. 
 
 
మరోవైపు దక్షిణాదిలో పాగా వేయాలని గత కొంతకాలంగా అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ పలు రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు - కేరళలో పూర్తిగా విఫలమైన బీజేపీ... కర్ణాటకలో కొంతవరకు సఫలమైనా అధికారం అంచుల వరకూ వచ్చి నిలిచిపోయారు. ఈ క్రమంలో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణలో బలపడేందుకు పరిపూర్ణానందను బరిలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. 
 
ఆధ్యాత్మిక గురువుగా - హిందూ ఆధ్యాత్మికవేత్తగా తెలంగాణలో ప్రజాకర్షణ ఉన్న పరిపూర్ణానందను తెలంగాణ యోగి ఆదిత్యనాథ్‌గా చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అందుకు పరిపూర్ణానంద కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం వీరికి మరింత కలిసి వచ్చింది. దీంతో పరిపూర్ణానంద బీజేపీలో చేరడం సులువైంది. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన పరిపూర్ణకు రాజకీయ కొలువునిచ్చే ఏదేని నియోజకవర్గం కావాలిగా మరి. దాన్ని కూడా ఇచ్చి తెలంగాణలో ఆయన గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందుకు సంబంధించిన ఓట్ల లెక్కల వివరాలు, కులం, మతం, వర్గాల వారీగా లెక్కలు చూసుకునే పనిలో నిమగ్నమైంది. మరోవైపు పరిపూర్ణానంద తెలంగాణలోని నిజమాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను రావణుడి ప్రతిమకు నిప్పు పెట్టగానే వెళ్లిపోయా? సిద్ధూ భార్య