Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై త‌ల్లి, కూతురు! కారు టైరు పంక్ఛ‌ర్ అయితే...

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (12:01 IST)
అది అర్ధ‌రాత్రి... న‌డి రోడ్డుపై కారు పంక్చ‌ర్ అయింది. కారులో ఉన్న‌ది కేవ‌లం ఓ త‌ల్లి, ఆమె కూతురు. చుట్టూ చిమ్మ చీక‌టి. కారు దిగి పంక్చ‌ర్ వేద్దామ‌నుకున్నా... కారు డోరు తెరిచి, తెగించి దిగితే ఏమ‌వుతుందో అనే భ‌యం. ఏదైనా అఘాయిత్యం జ‌రిగితే, అరిచి గీ పెట్టినా వినిపించుకునే నాధుడుండ‌డు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఏం చేయాలి? స‌రిగ్గా అదే చేశారు, ఆ త‌ల్లీ, కూతురు. ఎంచ‌క్కా దిశా యాప్ కి ఎస్.ఓ.ఎస్. కాల్ చేశారు. నిమిషాల్లో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు.
 
 
ఒక ఆడ‌పిల్ల దిశ యాప్ కాల్ కు స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులకు అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళన చెందింది. వెంట‌నే తేరుకుని  దిశా యాప్ SOS కాల్ చేసింది. కేవలం 10 నిముషాలలో పోలీసులు వారి వద్దకు చేరుకొని  సమస్యను పరిష్కరించారు చిన మర్రిపాడు పోలీసులు. ఆమె కారు టైర్ మార్పించి, సుర‌క్షితంగా గ‌మ్యం చేరేలా స‌హ‌క‌రించారు. ఎపి పోలీసుల సేవలు సలాం అంటూ ఆ త‌ల్లి, కూతుళ్ళు మ‌ర్రిపాడు పోలీసుల‌కు కృత‌జ్ణ్న‌త‌లు తెలిపారు. దిశ యాప్ సర్వీస్ ను పటిష్టంగా కార్యరూపంలోకి తెచ్చినందుకు పోలీసులకి ఎంతో ఋణపడి ఉన్నామంటూ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments