ఠారెత్తిస్తున్న ఎండలు.. 76 యేళ్ల తర్వాత ఢిల్లీలో సరికొత్త రికార్డు

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:46 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలా ఠారెత్తిస్తున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా గత 76 యేళ్లలో అంటే 1945 సంపత్సరం తర్వాత ఎన్నడూ నమోదు కాని విధంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలలో రికార్డు స్థాయిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. 
 
నగరంలోని సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ అని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రం అధిపతి కుల్దీప్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 31 మార్చి 1945లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా రికార్డయిందని, ఆ తర్వాత దేశ రాజధానిలో మార్చిలో ఇదే అత్యంత ఉష్ణోగ్రత ఉన్న రోజని చెప్పారు.
 
అయితే గత మూడు నాలుగు రోజులుగా ఆకాశం నిర్మలంగా ఉండడం, గాలివేగం తక్కువగా ఉండడంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. 1973, మార్చి 29న నగరంలో గరిష్ఠంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది మార్చిలో మూడో అత్యంత వేడిమి ఉన్న రోజన్నారు. నజాఫ్‌గఢ్‌, నరేలా, పిటాంపురా, పూసాలోని వాతావరణ కేందాల్లోవరుసగా 41.8 నుంచి 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ పేర్కొంది. 
 
ఇదిలావుండగా, నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.6 డిగ్రీలకు చేరాయి. ఇదిసాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ. సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే.. ‘హీట్‌ వేవ్‌’గా ప్రకటిస్తారు. సాధారణ ఉష్ణోగ్రత నుంచి 6.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ‘తీవ్రమైన’ వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments