Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాచేపల్లి రేప్ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య.. చెట్టుకు ఉరివేసుకునీ..

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు సుబ్బయ్య శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఈ అత్యాచార ఘటన బయటకు పొక్కడంతో నిందితుడు ఇల్లు విడిచి పారిపోయిన విషయం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (13:11 IST)
గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు సుబ్బయ్య శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఈ అత్యాచార ఘటన బయటకు పొక్కడంతో నిందితుడు ఇల్లు విడిచి పారిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు శుక్రవారం ఉదయం తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కాగా, దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పైగా, సుబ్బయ్య ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం, సుబ్బయ్య ఫోటోలతో పోస్టర్లు విడుదల చేయడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అయితే సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టుగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గురజాల మండలం దైదా - తేలికుంట్ల మధ్య చెట్టుకు ఉరివేసుకుని ఆయన ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments