పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త... ఏంటది?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (09:34 IST)
దేశంలో పండుగ సీజన్ మొదలైంది. దీంతో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మొత్తాన్ని పండుగ అడ్వాన్సుగా చెల్లిస్తారు. తిరిగి నెలసరి వేతనంలో కత్తిరిస్తారు. 
 
కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పడిపోవటంతో కొనుగోళ్లకు ఊతమిచ్చేందుకు వీలుగా కేంద్రం ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. అంటే.. కేంద్ర ప్రభుత్వమే డబ్బులు మనతో పండుగ వేళ ఖర్చు చేయిస్తుంది. ఆ తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని వేతనాల్లో కత్తిరిస్తుంది. 
 
ఇదే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, కేంద్రప్రభుత్వ ఉద్యోగులందరికీ పండుగ అడ్వాన్సుగా రూ.10,000 చొప్పున ఇస్తామని, ఆ మొత్తాన్ని పదివాయిదాల్లో ఉద్యోగి వేతనం నుంచి తిరిగి తీసుకుంటారని తెలిపారు.
 
అలాగే ఉద్యోగులకు ఇచ్చే ప్రయాణ భత్యానికి (ఎల్టీసీ) బదులుగా ఈ ఏడాది ఆదాయ పన్ను లేని నగదు వోచర్లు ఇస్తామన్నారు. 10 రోజులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ సౌకర్యం కూడా అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ ప్రయోజనాలు పొందేవారు పలు షరతులకు లోబడి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. 
 
మరోవైపు లాక్డౌన్‌ కారణంగా ఆదాయాలు పడిపోయి సతమతమవుతున్న రాష్ట్రాలకు రూ.12 వేలకోట్ల దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలను కూడా నిర్మల ప్రకటించారు. ఈ రుణాల కాలపరిమితి 50 యేళ్లు. అలాగే దేశంలో మౌలిక వసతుల కల్పనకు రూ.25 వేల కోట్లు, కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు అమలుచేసినందుకు మరో రూ.2వేల కోట్లు చొప్పున కేటాయించినట్టు ఆమె ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments