Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ట్రాక్టర్ డ్రైవర్ అదృష్టవంతుడు... ఎందుకంటే..? (video)

Advertiesment
ఆ ట్రాక్టర్ డ్రైవర్ అదృష్టవంతుడు... ఎందుకంటే..? (video)
, సోమవారం, 12 అక్టోబరు 2020 (16:30 IST)
ఆ ట్రాక్టర్ డ్రైవర్ అదృష్టవంతుడు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైనా.. డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రాక్టర్ రెండు ముక్కలు అయినప్పటికీ దాని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. చిన్న రోడ్డు నుంచి ఓ ట్రాక్టర్ హైవే పైకి వచ్చింది. ఇంతలో అదే రోడ్డుపై ఓ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి ట్రాక్టర్ ముందు భాగాన్ని ఢీ కొట్టింది. కారు వేగానికి ఆ ట్రాక్టర్ ముందు భాగం రెండు ముక్కలైంది. సరిగ్గా డ్రైవర్ సీటు దగ్గర ట్రాక్టర్ విరిగిపోయింది. 
 
అయినా కూడా డ్రైవర్‌కు మాత్రం ఏం గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని.. ప్రాణనష్టం జరగకపోవడం సంతోషమని కామెంట్లు పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లోకి టెక్నో కామోన్-16 స్మార్ట్ ఫోన్.. ధర రూ.10,999