చౌక ధరకే ఎయిర్ ఏషియా టిక్కెట్

మంగళవారం, 5 నవంబరు 2019 (11:08 IST)
దేశంల చౌక ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్‌ఏషియా మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,019గా నిర్ణయించింది. 
 
అలాగే, అంతర్జాతీయ రూట్లలో రూ.2,399గా నిర్ణయించింది. ఎయిర్‌ఏషియా బిగ్ సభ్యులు సోమవారం నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సాధారణ ప్రజలు ఈ నెల 4 నుంచి 10 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించింది.
 
ఈ తరహా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు వచ్చే ఏడాది ఏప్రిల్ 27 నుంచి మార్చి 1, 2021 వరకు ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చు. దీనిపై కంపెనీ సీవోవో సంజయ్ కుమార్ మాట్లాడుతూ, సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రూ.599 ప్లాన్‌తో రూ.4 లక్షల జీవిత బీమా.. ఎయిర్‌టెల్ నయా ప్లాన్