సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ కేవలం 999 రూపాయలకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ టిక్కెట్ల బుకింగ్స్ మాత్రం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేసుకోవచ్చు.
ఈ స్పెషల్ ఆఫర్ ధరతో దేశంలోని 20 రూట్లలో ప్రయాణం చేయవచ్చు. అంతర్జాతీయ మార్గాల్లో మాత్రం రూ.2,999కే ప్రారంభ టికెట్స్ అందుబాటులో ఉండగా.. సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, బాలి ప్రాంతాలకు ఈ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే మరో విమానయాన సంస్థ ఇండోగో కూడా రూ.999కే టికెట్ ధరను ప్రకటించిన విషయం తెల్సిందే.
కాగా, ఎయిర్ ఏషియా ప్రయాణ చార్జీల్లో రాయితీ ప్రకటించిన మార్గాలను పరిశీలిస్తే, బెంగుళూరు, న్యఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చిన్, గోవా, జైపూర్, చండీఘర్, పూణె, గౌహతి, ఇంఫాల్, భోపాల్, వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, చెన్నై మార్గాలు ఉన్నాయి.