Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిగో బంపర్ ఆఫర్.. రూ.999కే విమాన ప్రయాణం

Advertiesment
ఇండిగో బంపర్ ఆఫర్.. రూ.999కే విమాన ప్రయాణం
, బుధవారం, 15 మే 2019 (10:02 IST)
దేశంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థ తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.999కే విమాన ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో 53 రూట్లలో ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను అందుబాటులో ఉంచుంది 
 
అయితే, ఈ ఆఫర్ కింద ఈనెల 15, 16వ తేదీల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సివుండగా, ప్రయాణం మాత్రం ఈనెల 29వ తేదీ నుంచి సెప్టెంబరు 28వ తేదీలోపు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద 53 దేశవాళీ రూట్లతో పాటు 17 అంతర్జాతీయ మార్గాల్లో ప్రకటించినట్టు ఇండిగో సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ సెలవుల్లో అధిక లగేజీతో వెళ్లేవారికి అదనపు చార్జీలపై 30 శాతం రాయితీని అందించనున్నామని ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత