Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునయనకు ఓటు వేసిన ఆ ఇద్దరు వెర్రివాళ్లా? బిగ్ బాస్ ఇంట్లో తమాషా...

చాలా రోజుల తరువాత బిగ్ బాస్ షో ఆహ్లాదకరంగా సాగింది. ఆరో వారానికి కెప్టెన్ ఎంపిక కోసం అర్థవంతమైన రీతిలో పోటీ నిర్వహించారు. ఇంటిలోని సభ్యుల్లో ప్రతి ఒక్కరి నుంచి వారికి తెలియకుండా ఒక వస్తువు దొంగిలించాల

Webdunia
శనివారం, 14 జులై 2018 (17:38 IST)
చాలా రోజుల తరువాత బిగ్ బాస్ షో ఆహ్లాదకరంగా సాగింది. ఆరో వారానికి కెప్టెన్ ఎంపిక కోసం అర్థవంతమైన రీతిలో పోటీ నిర్వహించారు. ఇంటిలోని సభ్యుల్లో ప్రతి ఒక్కరి నుంచి వారికి తెలియకుండా ఒక వస్తువు దొంగిలించాలని గీతా మాధురికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టాస్క్‌ను విజయవంతంగా పూర్తిచేసిన గీతా మాధురి పేరును ఈ రోజే బయటపెట్టారు బిగ్ బాస్. ఈ వారం కెప్టెన్‌ అయ్యే అవకాశాన్ని మహిళలకే ఇచ్చిన బాస్… కెప్టెన్సీ కోసం ఇద్దరు పోటీపడాలని సూచించారు. సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందుకు గీతను ఒక పోటీదారుగా బిగ్ బాసే ఎంపిక చేశారు. 
 
ఇక రెండో పోటీదారును మహిళలే ఎంపిక చేయాలని, అందులోనూ ఇప్పటి దాకా కెప్టెన్సీకి అసలు పోటీ చేయని వారిని ఎంపిక చేయాలని చెప్పారు. అందరూ కలిసి సునయను రెండో పోటీదారుగా ఎంపిక చేశారు. ఈ ఇద్దరూ తాము కెప్టెన్ అయితే ఇంటిని ఎలా సంస్కరిస్తారు, ఎలాంటి మార్పులు తెస్తారు అనేదానిపై సభ్యులకు వివరించి, తమకు ఓటు వేయమని అభ్యర్థించాలి. ఇద్దరూ అందరినీ ఆకట్టుకునే ప్రచారం చేశారు. ఇద్దరు చెప్పిన మాటలు సభ్యులందరినీ ఆలోచింపజేశాయి. చివరిగా రహస్య ఓటింగ్ నిర్వహించారు. 
 
పోటీదారులూ ఓటు వేశారు. 13 మందిలో గీతకు పదకొండు ఓట్లు వచ్చాయి. సునయనకు రెండు ఓట్లు పడ్డాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమంటే సునయన తన ఓటును కూడా గీతా మాధురికి వేయడం. ప్రస్తుత పరిస్థితిలో తనకంటే గీతనే ఇంటిని సమర్థవంతంగా నడిపించగలదని, అందుకే తన ఓటు కూడా ఆమెకే వేస్తున్నానని సునయన చెప్పింది. ఐతే సునయనకు ఓటు వేసిన ఆ ఇద్దరు ఏమైనా వెర్రివాళ్లా అంటూ కామెంట్లయితే 
 
ఇదంతా ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా సాగింది. గడచిన మూడు రోజులు మంచివాళ్లు… చెడ్డవాళ్లు టాస్క్‌లో కుక్కల్లా కాట్లాడుకిని విధ్వంసం సృష్టించిన సభ్యులు శుక్రవారం ప్రశాంతంగా కనిపించారు. ఈ విధంగా చూసే ప్రేక్షకులకూ ఆలోచన కలిగించేలా టాస్క్‌లు రూపొందిస్తే బిగ్ బాస్‌కు ఆదరణ మరింత పెరుగుతుంది. 
 
ఇదిలావుండగా నిన్న టాస్క్ సరిగా చేయలేదనే పేరుతో జైలుకు పంపిన భానుశ్రీని ఉదయాన్నే బిగ్ బాస్ విడుదల చేశారు. ఆమె కోసం తన వద్ద ఉన్న జైలు కార్డును ఉపయోగించడానికి ఎవరైతే (కౌశల్) ఆమెను జైల్లో పెట్టారో అతనే నిన్నరాత్రి ప్రయత్నించగా అందుకు బిగ్ బాస్ అభ్యంతరం చెప్పారు. అలా చేయడానికి వీల్లేదన్నారు.
 
ఏమైనా గీతా మాధురిపై ఎంతో నమ్మకంతో ఇంటి సభ్యులు దాదాపు ఏకగ్రీవంగా కెప్టెన్సీ బాధ్యతలు బాప్పగించారు. దీన్ని ఎలా నిర్వర్తిస్తారో చూడాలి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఇల్లు. ఈ ఇంటి నిర్వహణ అంత తేలిక కాదు. మధ్యమధ్యలో బిగ్ బాసే పుల్లలు పెడుతుంటారు. బాగున్న వాతావరణాన్ని చెడగొడుతుంటారు. అప్పటిదాకా అందరి అభిమానాన్ని చూరగొని కెప్టెన్ అవగానే వ్యతిరేకత తెచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments