Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చింతామణి గణపతి అనుగ్రహం.... అందరి కోరకలు నెరవేరుస్తూ....

భక్తుల చింతలు తీరుస్తూ వారిచే 'చింతామణి గణపతి' గా విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాన్ని స్థలపురాణం చెబుతోం

Advertiesment
చింతామణి గణపతి అనుగ్రహం.... అందరి కోరకలు నెరవేరుస్తూ....
, శనివారం, 14 జులై 2018 (11:40 IST)
భక్తుల చింతలు తీరుస్తూ వారిచే 'చింతామణి గణపతి' గా విశేష పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాన్ని స్థలపురాణం చెబుతోంది. పూర్వం అభిజిత్తు - గుణవతి అనే రాజ దంపతులకు ఓ మగబిడ్డ జన్మించాడు. ఆ దంపతులు అతనికి గణరాజు అనే పేరు పెట్టారు.
 
యుక్త వయస్కుడైన గణరాజు ఓ రోజున తన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. విపరీతమైన ఎండ ఉన్న కారణంగా 'కపిలమహర్షి' ఆశ్రమంలో సేదదీరాడు. ఆ సమయంలోనే కపిలమహర్షి దగ్గర ఉన్న 'చింతామణి' ని చూశాడు. కోరిన కోరికలను తక్షణమే తీర్చే ఆ చింతామణిని తనకి ఇవ్వమని అడిగాడు. అందుకు కపిలుడు నిరాకరించడంతో బలవంతంగా దానిని తీసుకుపోయాడు.
 
దాంతో కపిలుడు విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడు. వినాయకుడు ప్రత్యక్షం కావడంతో జరిగింది వివరించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దాంతో వినాయకుడు గణరాజును సంహరించి ఆ చింతామణిని కపిలుడికి అప్పగించాడు. కపిలుడి ప్రార్థన మేరకు ఆ ప్రదేశంలోనే స్వయంభువుగా వెలిశాడు. నాటి నుంచి నేటి వరకు భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం (14-07-18) దినఫలాలు - దంపతుల మధ్య కలహాలు...