Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాఘవేంద్ర స్వామి మహిమ ఎంతటిదో చూడండి...

వెంకన్న అనే భక్తుడు రాఘవేంద్రస్వామిని అనేక సంవత్సరముల నుండి అత్యంత భక్తి శ్రద్దలతో సేవిస్తున్నాడు. అతను భక్తితో నీరు తెచ్చి, పూజాది కైంకర్యాలను, సపర్యలను చేస్తున్నాడు. అతని భక్తికి మెచ్చి రాఘవేంద్రస్వాముల వారు నీకేమి కావాలి.... అని అడిగినప్పుడల్లా వె

రాఘవేంద్ర స్వామి మహిమ ఎంతటిదో చూడండి...
, శుక్రవారం, 13 జులై 2018 (22:12 IST)
వెంకన్న అనే భక్తుడు రాఘవేంద్రస్వామిని అనేక సంవత్సరముల నుండి అత్యంత భక్తి శ్రద్దలతో సేవిస్తున్నాడు. అతను భక్తితో నీరు తెచ్చి, పూజాది కైంకర్యాలను, సపర్యలను చేస్తున్నాడు. అతని భక్తికి మెచ్చి రాఘవేంద్రస్వాముల వారు నీకేమి కావాలి.... అని అడిగినప్పుడల్లా వెంకన్న ఏమి వద్దని చెబుతున్నాడు. కానీ చిత్రదుర్గానికి వచ్చినప్పుడు మాత్రం తనకు ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. దానికి రాఘవేంద్రులవారు ఇది చాలదు, నీవు అన్ని విధాల సంసిద్దుడు కావాలి అన్నారు. 
 
అప్పుడు వెంకన్న తమరి ఆదేశాన్ని పాటిస్తాను అనుమతివ్వండి అన్నాడు. అప్పుడు స్వామి వారు స్నానం సంధ్యావందనాలు ముగించుకుని రా అన్నారు. వచ్చిన వెంటనే పంచగవ్యాదులను ప్రాశనం చేయించి ప్రాయశ్చిత్తాదులను చేయించారు. ఆ తరువాత ఎండుకట్టెలతో చితిని పేర్చి అగ్ని ప్రజ్వలనం చేయించి ఆతనిని అగ్నిలో దూకమని ఆజ్ఞాపించారు. అతను కూడా నిశ్చల మనసుతో అగ్నికి ప్రదక్షిణ చేసి అగ్నిలోకి దూకాడు. అప్పుడు అక్కడ ఉన్నవారంతా అవాక్కై చూస్తూ గుసగుసలాడుతున్నారు. అంతలో దేవ విమానం వచ్చింది.
 
అందులో దిల్యశరీరధారియైన వెంకన్నని ఎక్కించుకుపోతున్నారు. అప్పటి ఘంటానాధం, దేవదుందుభులు పుష్పవృష్టికి అందరూ అవాక్కయ్యారు. మోక్షప్రదాత సాక్షాత్తు శ్రీహరి కూడా అతని అనుమతితో ఆంజనేయుడి మోక్షాన్ని ఇవ్వగలరు. ఆంజనేయుని మూలంగా శ్రీహరితో మోక్షాన్ని ఇప్పించే సామర్ద్యం గలవారు రాఘవేంద్ర స్వాములవారు. ఈ వార్త దశదిశలా వ్యాపించి అందరికీ రాఘవేంద్రస్వాములవారి మహిమ తెలిసిపోయింది. అలా రాఘవేంద్ర స్వామివారు భక్తుని కోరికను మన్నించి వెంకన్నను ఆద్యాత్మక పరంగా సంసిద్దుడుని చేసి మోక్షాన్ని ప్రసాదించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బల్లిపాటు శకునం మంచిదేనా?(video)