Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. తప్పుబట్టిన కత్తి మహేష్

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడాన్ని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తీవ్రంగా ఖండించారు. తనపై నగర బహిష్కరణ వేటువేయడాన్ని పెద్దగా పట్టించుకోని కత్తి.. పరిపూ

Advertiesment
పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. తప్పుబట్టిన కత్తి మహేష్
, బుధవారం, 11 జులై 2018 (15:46 IST)
శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడాన్ని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తీవ్రంగా ఖండించారు. తనపై నగర బహిష్కరణ వేటువేయడాన్ని పెద్దగా పట్టించుకోని కత్తి.. పరిపూర్ణానందను కూడా నగరం నుంచి బహిష్కరించడాన్ని తప్పుబట్టారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బహిష్కరణలు సమస్యకు పరిష్కారం కాదని, బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మనుషుల్ని 'తప్పిస్తే' సమస్యలు తప్పుతాయనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుందని కత్తి మహేష్ ట్వీట్ చేశారు.
 
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కత్తి మహేష్‌పై హైదరాబాద్‌లో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హైదరాబాద్ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. స్వయంగా తెలంగాణ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి కత్తి మహేష్‌పై 6 నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు.
 
ఇక శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా హైదరాబాద్ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. గతంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. వాటికి ఆయన సమాధానం చెప్పలేదంటూ పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ విధించారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద బహిష్కరణపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేక్ మెసేజెస్ ఫార్వర్డ్ చేశారో.. అంతే.. డేగ కన్నుతో వాట్సాప్‌ న్యూ ఫీచర్