Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుఖం కోసం వేశ్యాగృహానికి వెళితే అమ్మాయి చెప్పింది విని కన్నీరు పెట్టుకున్నాడు?

ఒక మనిషి జీవితంలో ఆశ్చర్యపోయే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థి సుఖం కోసం వేశ్యా గృహానికి వెళ్ళాడు. అక్కడ ఆ యువతి చెప్పిన మాటలు విని కన్నీరు ఆపులేకపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని పోలీసులను ఆశ్రయించాడు. మూడు స

Webdunia
శనివారం, 14 జులై 2018 (17:08 IST)
ఒక మనిషి జీవితంలో ఆశ్చర్యపోయే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థి సుఖం కోసం వేశ్యా గృహానికి వెళ్ళాడు. అక్కడ ఆ యువతి చెప్పిన మాటలు విని కన్నీరు ఆపులేకపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని పోలీసులను ఆశ్రయించాడు. మూడు సంవత్సరాల నరక యాతన తరువాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఇదంతా ఎక్కడో కాదు గుంటూరు జిల్లా చిలుకూరిపేటలో జరిగిన సంఘటన.
 
వినోద్.. విజయవాడలోని ఒక ప్రైవేటు కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆ యువకుడు మొదటిసారి వేశ్యా గృహానికి వెళ్ళాడు. అది కూడా గుంటూరు జిల్లా చిలకూరిపేటలో. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఐదువేలు కట్టి ఒక యువతిని బుక్ చేసుకున్నాడు. సాయంత్రం అమ్మాయి గదిలోకి వచ్చింది. గదిలో ఉన్న వినోద్‌ను చూడగానే ఎందుకో ఆ అమ్మాయి బోరున విలపించింది. తనకు బాగా తెలిసిన పరిచయస్తుడిలా అతనితో తన జీవితంలో జరిగిన బాధను వివరించింది.
 
గుంటూరు నగరానికి చెందిని యువతి మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులను ఎదిరించి అతన్ని వివాహం చేసుకుంది. ఆ తరువాత విజయవాడలో కాపురం పెట్టాడు యువకుడు. రెండునెలల పాటు వీరి సంసారం బాగానే సాగింది. ఆ తరువాత తన ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి మహారాష్ట్రకు వెళ్ళాడు ఆ యువకుడు. వారంరోజుల పాటు రాలేదు. వారం తరువాత ఇంటికి వచ్చి మా అమ్మా,నాన్న నిన్ను చూడాలంటున్నారని చిలకలూరిపేటకు తీసుకొచ్చాడు. అక్కడ ఒక వేశ్యాగృహంలోకి నెట్టేసి డబ్బులు తీసుకుని పారిపోయాడు. దీంతో మూడు సంవత్సరాల ఆ యువతి అక్కడే ఉండిపోయింది. 
 
తప్పించుకోవడానికి ప్రయత్నించినా, ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆ యువతి బోరున విలపించింది. దీంతో ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు. కంట కన్నీరు ప్రారంభమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన యువకుడు ధైర్యం చేసి పోలీసులకు తెలిపాడు. ఆ స్థావరంపై పోలీసులు దాడి చేసి యువతులను బయటకు పంపేశారు. దీంతో ఆ యువతి తిరిగి తన ఇంటికే వెళ్ళిపోయింది. మూడు సంవత్సరాల నరక యాతన నుంచి బయటకు తీసుకువచ్చిన వినోద్ కాళ్ళపై బడి దణ్ణం పెట్టి మరీ ఆ యువతి కన్నీరు పెట్టుకుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments