Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు మనుషులేనా? ఇలా కొట్టుకుంటున్నారేంటి? జూలో జంతువులు (వీడియో)

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:53 IST)
మనుషుల ఆరో సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జంతువులు షాకై చూసేలా మనుషులు నడుచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. క‌రోనాకు  కార‌ణ‌మైన చైనాలో ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రావ‌డంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి. ప‌ర్యాట‌క రంగం తిరిగి ప్రారంభ‌మైంది.  రాజ‌ధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.  
 
ఆదివారం రోజున పెద్ద‌సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు బీజింగ్ జూకు త‌ర‌లి వ‌చ్చారు. అయితే, జూలో ఉన్న‌ట్టుండి ఇద్ద‌రు ప‌ర్యాట‌కుల మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మైంది.  ఆ గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌లా మారి రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లా మారిపోయింది. రెండు కుటుంబాలకు చెందిన మ‌హిళ‌లు జుట్టుప‌ట్టుకొని కొట్టుకున్నారు.  మ‌హిళ‌లు అని చూడ‌కుండా పురుషులు మ‌హిళ‌ల‌పై తిర‌గ‌బ‌డి కొట్టారు. దీంతో ఆక్క‌డ ఉన్న ప‌ర్యాట‌కులు ఏం జ‌రుగుతుందో తెలియ‌క నిల‌బ‌డిపోయారు.
 
అటు జూలో ఉన్న జంతువులు కూడా ఆ కొట్లాట‌ని ఆస‌క్తిగా గ‌మ‌నించాయ‌ని, రాత్రి స‌మయంలో ఉన్న‌ట్టుండి జంతువులు కూడా కొట్లాట‌కు దిగాయ‌ని, మ‌నుషుల ప్ర‌భావం ఆ జంతువుల‌పై కూడా క‌నిపించింద‌ని జూ నిర్వాహ‌కులు పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments