Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో యువజంట బరితెగింపు : రన్నింగ్ బైకుపై ముద్దులాట

Advertiesment
బీహార్‌లో యువజంట బరితెగింపు : రన్నింగ్ బైకుపై ముద్దులాట
, బుధవారం, 4 ఆగస్టు 2021 (14:17 IST)
ఓ యువజంట బరితెగించింది. రన్నింగ్ బైకుపై ముద్దులు పెట్టుకుంటున్నారు. ఈ జుగుత్సాకరమైన సంఘటన బీహార రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గ‌య ప‌ట్ట‌ణంలో ఓ యువ‌జంట బైక్‌పై వెళ్తూ బ‌రితెగించి మ‌రీ రొమాన్స్ చేసింది. 
 
దారివెంట ఎంతో ర‌మ‌ణీయంగా ఉన్న ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని ఆస్వాదించ‌కుండా ముద్దులాట‌లో మునిగితేలింది. యువ‌కుడు బైక్ న‌డుపుతుండ‌గా సినిమా స్టైల్‌లో యువ‌తి అత‌నికి ఎదురుగా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని ముద్దులు పెట్టింది. న‌డి రోడ్డుపై ర‌న్నింగ్ బైక్‌పై ఆ యువతి బరితెగించింది. 
 
అయితే, చివ‌రికి దారిలో ఓ గ్రామ‌స్తులు ఆ బ‌రితెగించిన జంట‌ను ఆపి తిక్కకుదిర్చారు. న‌డిరోడ్డుపై స‌భ్య‌త సంస్కారం లేకుండా ఏమిటీ పిచ్చి ప‌నులంటూ నిలదీశారు. రన్నింగ్ బైక్‌పై ఇంత బ‌రితెగింపు అవ‌స‌ర‌మా అని ప్రశ్నించారు. మ‌రోసారి ఇలాంటి పిచ్చి ప‌నులు చేస్తూ కంట‌బ‌డితే కాళ్లు, చేతులు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతామంటూ హెచ్చరించారు. 
 
గ్రామస్తుల వార్నింగ్‌కు ఆ జంట మనలోకంలోకి వచ్చింది. యువ‌తి పెట్రోల్ ట్యాంక్ దిగి బుద్ధిగా వెనుకాల సీట్లోకి వెళ్లి కూర్చుని ప్రయాణం చేసింది. అయితే, ఆ యువ‌జంట బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద టాటా సుమోలో మంటలు, తృటిలో తప్పించుకున్న పోలీసులు