Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడలితో మామ అక్రమ సంబంధం.. భార్యను వదిలి ఉద్యోగానికి వెళ్తే..?

Advertiesment
కోడలితో మామ అక్రమ సంబంధం.. భార్యను వదిలి ఉద్యోగానికి వెళ్తే..?
, సోమవారం, 26 జులై 2021 (21:31 IST)
కోడలితో ఓ మామ అక్రమ సంబంధం కన్నకొడుకునే హత్యకు గురయ్యేలా చేసింది. తన సుఖానికి అడ్డొస్తున్న కొడుకును ఓ తండ్రి హతమార్చాడు. ఏమీ తెలియనట్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనకొడుకు కనపడటంలేదని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో చేసిన నేరం రుజువై కటకటాల పాలయ్యాడు తండ్రి.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నా పరిధిలోని కోద్రా ప్రాంతంలో నివసించే మిథిలేష్ రవిదాస్ కుమారుడు సచిన్‌కు కొంతకాలం క్రితం వివాహం చేశాడు. సచిన్ ఉపాధి నిమిత్తం గుజరాత్‌లో ఉద్యోగం చేస్తుండటంతో భార్యను వదిలి ఉద్యోగానికి గుజరాత్ వెళ్ళాడు. కోడలిపై కన్నేసిన మామ రవిదాస్ మాయమాటలతో కోడలిని వశపరుచుకున్నాడు.
 
కొడుకు ఇంట్లో లేకపోవటంతో కోడలితో రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకు ఈ విషయం కొడుకు సచిన్‌కు తెలిసిపోయింది. జులై7న ఇంటికి వచ్చిన సచిన్ తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో రవిదాస్ కత్తి తీసుకుని సచిన్ గొంతుకోసి చంపేశాడు. శవాన్ని సమీపంలోని తోటలో పడేశాడు.
 
ఏమీ ఎరుగనట్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన కొడుకు కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పైగా తనకు ఐదుగురు వ్యక్తులపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తోటలో పడి ఉన్న సచిన్ శవాన్ని గుర్తించి పోస్టు మార్టంకి తరలించారు.
 
పోస్టుమార్టం రిపోర్టులో గొంతుకోసి చంపబడినట్లు తేలింది. పోలీసులు చేసిన దర్యాప్తులో నిందితులు నేరాన్ని ఒప్పుకున్నాడు. కోడలితో ఉన్న అక్రమ సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడనే కారణంతోనే హతమార్చినట్లు అంగీకరించాడు. పోలీసులు రవిదాస్‌ను రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేనేతల అభ్యున్నతికి తుదివరకు శ్రమించిన ప్రగడ: ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు