Webdunia - Bharat's app for daily news and videos

Install App

ATM నుంచి డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? ఇక ఛార్జీల మోత మోగుతుంది

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (12:23 IST)
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఏటీఎంల నుంచి ఉచిత డబ్బు లావాదేవీలను అనుమతిస్తాయి. ఇకపై ఉచిత నెలవారీ లావాదేవీలకు సంబంధించి అనుమతించదగిన పరిమితికి మించి ATMలను ఉపయోగిస్తే ఛార్జీలు విధిస్తారు. గత ఏడాది జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1 జనవరి 2022 నుండి అమలులోకి వచ్చే నెలవారీ ఉచిత లావాదేవీ పరిమితికి మించి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ. 21 ఛార్జ్ చేయడానికి బ్యాంకులు అనుమతించబడ్డాయి.

 
ఇంతకుముందు బ్యాంకులు అటువంటి ప్రతి లావాదేవీకి రూ 20 వసూలు చేయడానికి అనుమతించబడ్డాయి. వినియోగదారులకు ప్రతి నెలా వారి బ్యాంక్ ATMలలో ఐదు ఉచిత లావాదేవీలు అనుమతి వుంది. అలాగే ఇతర బ్యాంక్ ATMలకు పరిమితి మూడు ఉచిత లావాదేవీలు. నాన్-మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ATMలలో ఐదు ఉచిత లావాదేవీలను పొందవచ్చు.

 
1 ఆగస్టు 2022 నుండి అన్ని కేంద్రాలలో ఆర్థిక లావాదేవీకి రూ. 17, ప్రతి ఆర్థికేతర లావాదేవీకి రూ. 6 ఇంటర్‌చేంజ్ రుసుమును విధించడానికి బ్యాంకులను ఆర్బీఐ అనుమతించింది. పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎం సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తాయి. కస్టమర్ కలిగి ఉన్న కార్డ్ రకాన్ని బట్టి అన్ని ప్రధాన బ్యాంకులు డెబిట్ కార్డ్‌లపై వార్షిక రుసుమును కూడా వసూలు చేస్తాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments