Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈఎంఐలు మరింత భారం... వడ్డించిన ఆర్బీఐ

Advertiesment
reserve bank of india
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:00 IST)
భారత రిజర్వు బ్యాంకు షాకిచ్చింది. అందరూ భావించినట్టుగానే ఆర్బీఐ రెపో రేటును పెంచేసింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు శుక్రవారం ప్రకటించింది. 
 
పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్‌ పాయింట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపడం గమనార్హం. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచి షాకిచ్చింది. 
 
మే నెలలో అనూహ్యంగా సమావేశమై 40 బేసిస్‌ పాయింట్లు.. జూన్‌ ద్వైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆ భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. తాజా మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు మరింత ప్రియం కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై రాజధాని కాలేజీ దశ తిరిగిందా?... 1,106 డిగ్రీ సీట్ల కోసం 95,136 దరఖాస్తులు