Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని పొందేందుకు ఇనార్బిట్‌ మాల్‌ సైబరాబాద్‌కు తరలిరండి

image
, సోమవారం, 8 ఆగస్టు 2022 (21:54 IST)
ఈ సంవత్సరం భారతీయులందరికీ అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే, భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఇనార్బిట్‌ మాల్‌ , సైబరాబాద్‌ వద్ద ఈ వేడుకలు ఆగస్టు 6వ తేదీన మాల్‌ ముందు భాగంలో త్రివర్ణ పతాక రంగులలో అలంకరణ లైట్లు వెలిగించడంతో ప్రారంభమయ్యాయి.

 
హైదరాబాద్‌ వాసులు ఈ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలో భాగంగా మాల్‌ నుంచి ఎంతో ఆశించవచ్చు. అత్యంత అందమైన, కళాత్మకంగా తీర్చిదిద్దిన ఫ్రీడమ్‌ ట్రీ ఇన్‌స్టాలేషన్‌ సందర్శకులను మాల్‌ లోపలకు ఆహ్వానించడమే కాదు, స్వేచ్ఛా స్ఫూర్తిని సైతం రగిలిస్తోంది. మాల్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరూ  భారతదేశం కోసం తమ ఆకాంక్షలను ఆ చెట్టు వద్ద రాయడం లేదా మన దేశం గురించిన భావాలను రాయడం, దానిని చెట్టుకు అంటించడం చేయవచ్చు. దీనికి ప్రతిఫలంగా, వీరికి ఓ జాతీయజెండానూ పొందవచ్చు. తమ సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌పై  ఈ ఫ్రీడమ్‌ ట్రీ వద్ద దిగిన చిత్రాన్ని అప్‌లోడ్‌ చేసిన సందర్శకులు దానిని inorbitcyberabadకు ట్యాగ్‌ చేసిన యెడల మాల్‌ నుంచి ఓచర్లను సైతం పొందే అవకాశం ఉంది. ఈ యాక్టివిటీ ఆగస్టు 15వ తేదీ వరకూ జరుగుతుంది.

 
మాల్‌లో తాము గడిపిన ప్రతి క్షణాన్నీ బంధించాలనుకునే సందర్శకులకు మాల్‌లో తమ మధుర క్షణాలను బంధించుకునేందుకు విస్తృత శ్రేణి అవకాశాలు కూడా ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మువ్వన్నెల బ్యాక్‌డ్రాప్స్‌లో ఎల్‌జీ పిల్లర్‌, అట్రియం హ్యాంగింగ్స్‌ మాల్‌లో ఉన్నాయి. ఇనార్బిట్‌ మాల్‌  హైదరాబాద్‌ను ఆగస్టు 15వ తేదీ లోపుగా సందర్శించడానికి మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి ప్రణాళిక చేసుకోండి. ఆనందానుభూతులనూ సొంతం చేసుకోండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తర్‌ప్రదేశ్: తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు